వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు అంటేనే సినీ ప్రేమికుల్లో మహా క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఇద్దరు కలిసి నటించే సినిమా అంటే అంచనాల మరింత ఎక్కువౌతాయి. ఇలాంటి సినిమాలకు కలెక్షన్ల వరద కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం హక్కులను షూటింగ్ దశలోనే ఉన్నప్పుడే దక్కించుకోవడానికి ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓవర్సీస్(విదేశీ)హక్కలను 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ భారీగా ధర చెల్లించి సొంతం చేసుకుంది. రూ. 6 కోట్లకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఈచిత్ర నిర్మాత దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. నాజర్ ఈ ఇద్దరు హీరోలకు తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి ఎంపికయ్యారు. జయసుధ ముఖ్య పాత్రను పోషిస్తోంది. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోన్నారు. ఇందులో లెక్చరర్ గా మహేష్ బాబు పాత్ర ఉంటుంది. ఈసినిమా వెంకీ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’ సినిమాను పోలిఉంటుందనే ఊహాగాలు వినిపిస్తున్నాయి. మరో వైపు వెంకటేష్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘షాడో’ చిత్రంలో నటిస్తున్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి