10 మార్చి, 2012

మనం తీస్తున్నవి చెత్త సినిమాలు... అవార్డులెలా వస్తాయ్?: తేజ

                                        Teja
మొన్న జాతీయ అవార్డుల జాబితాలో టాలీవుడ్‌కు చెందిన ఒక్క సినిమా కూడా లేకపోవడంపై ఇపుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై దర్శకుడు తేజను కదిలించినప్పుడు ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. 

అసలు టాలీవుడ్‌లో తీస్తున్న చిత్రాలు చెత్త సినిమాలనీ, గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఒకే టైపు ఫార్ములాతో వెళుతున్నారని అభిప్రాయపడ్డారు. అంతెందుకు... "నేను తీస్తున్న సినిమాలు కూడా అటువంటివే" అంటూ "చెత్త సినిమా" రూపకల్పన చేసేవారి జాబితాలో తననూ కలిపేసుకున్నారు.

టాలీవుడ్ దర్శకనిర్మాతలకు శుక్రవారం సినిమా విడుదలవుతుందంటే టెన్షన్‌ పట్టుకుంటుందని అన్నారు. సినిమాలో సరుకు లేనపుడు అలాగే ఉంటుందంటూ.. అయినా సత్తా లేని చిత్రాలు తీసినప్పుడు అవార్డు కోసం ఎదురుచూడటం అత్యాశ అవుతుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

బాగుందండి.
బాలీవుడ్ సినిమాల్లో సరుకుందా మరి?
అవార్డు వచ్చిన డర్టీ సినిమా నిజంగా గొప్పదేనా?
లేదా హిందీ అయితేనే గొప్పా?