పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి రంగంలోనూ మంచి వారు, చెడ్డ వారు ఉన్నట్లే మీడియా రంగంలోనూ అక్రమార్కులు, చీడ పురుగులు ఉన్నారు. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా మీడియాలో సెన్షేషన్ సృష్టించడం ఖాయం.
పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి