అసలు నాది హీరో మెటీరియలే కాదు. నేను తొలిసారి హీరోగా స్క్రీన్‌పై కనిపించినప్పుడు ‘వీడు హీరో అయితే... ఇక ఎవ్వడైనా హీరో అయిపోవొచ్చు’ అనే కామెంట్లు వినిపించాయి. నా దృష్టిలో అది కరెక్ట్. ఎవరైనా కావొచ్చు అంటున్నారు ధనుష్. ధనుష్ తన తాజా చిత్రం 3 తెలుగు ఆడియో విడుదల సందర్భంగా ఆయన ఇలా కామెంట్స్ చేసారు. అలాగే హీరో అవ్వాలంటే దానికి కృషి పట్టుదల అవసరం. నాకు పాత్రే ముఖ్యం. అంతేతప్ప డెరైక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? అనేదాన్ని పట్టించుకోను. ఐశ్వర్య చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే అన్నాను. అంతేతప్ప తను నా భార్య అని కాదు. ఇక ‘3’ విషయంలో ఒక్క ‘కొలవరి’ మాత్రమే కాదు. అన్ని పాటలూ ఆకట్టుకుంటాయి అన్నారు. ధనుష్, శ్రుతిహాసన్ జంటగా ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘3’.
ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాతలు కె.విమలగీత, నట్టికుమార్. సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి రాజశేఖర్, ధనుష్‌లకు అందించారు. ఇక చిత్రంలో సూపర్ హిట్ ‘కొలవరి’గురించి చెపుతూ...‘‘‘కొలవరి’ ప్లాన్ చేసుకొని ట్యూన్ చేసిన పాట కాదు. అనుకోకుండా దేవుడి కృపతో తయారైన పాట. ‘కొలవరి’ విషయంలో మేం పెద్దగా కష్టపడింది కూడా లేదు. ఈ పాటకూ నా జీవితానికి కూడా దగ్గర పోలికలున్నాయి. నేను ప్లాన్ చేసుకొని నటుడ్ని కాలేదు. నేనీరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒకే ఒక్క కారణం 'కొలవెరి ఢీ'. ఈ పాట కోసం మేం పెద్దగా కష్టపడిందేమీ లేదు. ముందుగా ప్రణాళిక వేసుకొని చేసింది అసలే కాదు. అద్భుతాలు అనుకోకుండా జరుగుతాయట. అలా వచ్చిందే ఈ పాట. అది అందరికీ నచ్చడం ఎంతో ఆనందాన్నిచ్చింది అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి