4 మార్చి, 2012

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది : మధుయాష్కీ

ఈనెల 18వ తేదీన జరిగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన యువ నేత మధుయాష్కీ జోస్యం చెప్పారు. 

దీనిపై ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులు మాత్రమే గెలుస్తారని తెలిపారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రాంత ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ కోసం కొండా సురేఖ రాజీనామా చేయలేదని, ఆమె గెలిచే అవకాశాలు లేవని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు: