గత 2011 సంవత్సరంలో దేశంలోని బీమా సంస్థలు వివిధ రకాల అవినీతి అక్రమాల వల్ల 30 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం పోయినట్టు ఒక అధ్యయనం తేల్చింది. ఈ అక్రమాల్లో బీమా సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్టు ఆ సర్వే తెలిపింది. మరణించిన పాలసీదారుని చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం తదితర కారణాల రీత్యా జీవిత బీమా సంస్థలు రూ.30401 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆ సంస్థ తెలిపింది. బీమా సంస్థ వ్యాపారంలో ఈ నష్టం తొమ్మిది శాతంగా అంచనా వేసినట్టు ఆ అధ్యయన సంస్థ తెలిపింది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) గణాంకాల మేరకు లైఫ్, నాన్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మొత్తం 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రీమియం ఆదాయం వచ్చినట్టు పేర్కొంది.
పూణే కేంద్రంగా పని చేసీ ఈ అధ్యయన సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఫ్రాడ్ ఎగ్జామినేషన్, సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫోరెన్సిక్ అకౌంటింగ్ రిసెర్స్ తదితర అంశాలపై అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ కోట్లాది రూపాయల కుంభకోణాలపై దర్యాప్తు జరిపే సీబీఐ వంటి సంస్థలకు కూడా సహకారం అందిస్తుంది.
కాగా, బీమా సంస్థల్లో చోటు చేసుకునే కుంభకోణాల్లో 86 శాతం జీవిత బీమాలో చోటు చేసుకుంటుండగా, 14 శాతం స్కామ్‌లు జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో చోటు చేసుకుంటున్నట్టు ఆ సర్వే సంస్థ తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కుంభకోణాలు గత ఐదేళ్ళకాలంలో 103 శాతం మేరకు పెరగగా, జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం పెరిగినట్టు తెలిపింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి