3 మార్చి, 2012

గుంటూరు జిల్లాలో సైకో అరెస్టు?, వైద్య పరీక్షలు

గుంటూరు: గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో అతను ఓ మహిళపై దాడి చేశాడు. దాడి చేస్తుండగా అతన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, అతను తెనాలి ప్రాంతంలో మహిళలపై దాడి చేస్తున్న సైకోనా, కాదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

స్థానికులు తమకు అప్పగించిన వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలోని తెనాలి, రేపల్లె, మంగళగిరి ప్రాంతాల్లో సైకో మహిళలపై దాడులు చేస్తున్నాడు. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల బారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. తెనాలిలో ఉన్నాడనే అనుమానంతో జిల్లా ఎస్పీ అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను కూడా అరెస్టు చేశారు. తమకు పట్టుబడిన వ్యక్తి మహిళలపై వరుస దాడులు చేస్తున్న సైకోనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

inkaa confirm kaaka munde saiko arrest ane heading enduku sir...news channels lo laaga sensations avasramaa blog s ku....adigaanani feel kaakandi...just tell me your openion behind that heading .

Vinay చెప్పారు...

మీరు చేప్పింది నిజం సవరిస్తాను అండి.