3 మార్చి, 2012

అతిథి పాత్రలో దర్శకుడు శ్రీను వైట్ల

                                Srinu Vytla


దర్శకుడు శ్రీను వైట్ల మరోసారి వెండి తెరపై మెరవనున్నారు. గతంలో ‘రెయిన్ బో’, ‘పరమ వీర చక్ర’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనం ఇచ్చిన ఈ దర్శకుడు తాజాగా శంకర్ హార్తాండ్ అప్ కమింగ్ మూవీ ‘పొగ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రణధీర్, బింధు మాధవి, సౌమ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటో గ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నిన్న ప్రారంభం అయింది.

మహేష్ బాబు హీరోగా రూపొందించిన ‘దూకుడు’ సినిమా భారీ విజయంతో శ్రీను వైట్ల రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. టాలీవుడ్ చరిత్రలో టాప్ గ్రాసర్లలో ఈ చిత్రం కూడా స్థానం దక్కించుకుంది. ఈచిత్రం తర్వాత శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 18 పూజా కార్యక్రమం, ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు

కామెంట్‌లు లేవు: