2 మార్చి, 2012

కళ్లుకప్పి..: ఎట్టకేలకు గాలి పిఏ అలీఖాన్ లొంగుబాటు

                                  Gali Janardhan Reddy

బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పిఏ అలీ ఖాన్ శుక్రవారం కర్నాటక కోర్టులో లొంగి పోయారు. గాలి దగ్గరగా పిఏగా పని చేసిన అలీ ఖాన్‌కు అతని అక్రమాల చిట్టా చాలా వరకు తెలుసునని సిబిఐ భావిస్తోంది. అందుకే అతని కోసం ఆరు నెలలుగా సిబిఐ గాలిస్తోంది. కాని అలీ ఖాన్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. అతనిపై సిబిఐ లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే శుక్రవారం అనూహ్య రీతిలో అతను కోర్టులో లొంగిపోయాడు. గాలి అక్రమాల చిట్టా తెలుసుకునేందుకు అలీ ఖాన్ కస్టడీని కూడా సిబిఐ కోరింది. అలీ ఖాన్‌కు 12వ తేది వరకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే సిబిఐ కళ్లు గప్పి అలీ ఖాన్ కోర్టులో లొంగిపోవడం విశేషం.

మరోవైపు ఎఎంసి కేసులో కర్నాటక కోర్టులో గాలిని సిబిఐ హాజరు పర్చింది. గాలి, సిబిఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రెండు వారాలు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. గాలి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి తరఫున వాదనలు విన్న కోర్టు గాలిని ఈ నెల 12వ తేది వరకు సిబిఐ కస్టడీకి అప్పగించింది. గాలి విచారణ బెంగళూరులోనే జరగనుంది.

కామెంట్‌లు లేవు: