బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు కోర్టు కేసు నుంచి ఊరట లభించింది. అతని ఇంటి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిల్‌ను ముంబై కోర్టు కొట్టి వేసింది. ముంబైలో బాంద్రాలో షారుఖ్ నిర్మించుకున్న కలల సౌధం ‘మన్నత్’ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా, పర్యావరణానికి హానికలించేదిగా ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్ర కోస్టల్ జోన్ అథారిటీ ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును ముంబై కోర్టు కొట్టి వేసింది. దీంతో షారుఖ్ కు ఊరట లభించినట్లయింది.
షారుఖ్ ఖాన్ ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా జరిగిందని సింప్రీత్ సింగ్, అమిత్ మౌరంద్ అనే ఇద్దరు కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. మన్నత్ గా పిలుచుకునే ఈ భవనం నిర్మాణంలో పురావస్తు చట్టాలను, తీరప్రాంత జోన్ నిబంధనలు ఉల్లంఘించారని తమ పిటిషన్ లో ఆరోపించారు. ఇదే విషయం మీద హై కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ తిరస్కరించడమే కాకుండా, పబ్లిసిటీ కోసం ఈ పిటిషన్ వేసారంటూ పిటిషనర్లకు 20 వేలరూపాయలు జరిమానా కూడా విధించింది. కానీ షారుఖ్ మాత్రం తన ఇంటి నిర్మాణంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని, మున్సిపల్ సంస్థ అనుమతులతోనే ఈ నిర్మాణం జరిగిందని వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి