ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా ఉండే సమంత రీసెంట్ గా మీడియాపై విరుచుకుపడి షాక్ ఇచ్చింది. ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉండవు. ఇది రొమాంటిక్ లవ్‌స్టోరీనే అయినా... చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య అంత చనువు ఉండదు. కానీ రొమాంటిక్ ఫీల్ మాత్రం ఉంటుంది. అనవసరంగా అర్థంలేని పుకార్లను సృష్టించొద్దు. ఈ సినిమా నా కెరీర్‌లోనే చాలా ముఖ్యమైన సినిమా’’ అంది సమంత.
ఆమె ఒకేసారి ముగ్గరు హీరోలతో లిప్ కిస్ చేస్తోందంటూ వచ్చిన రూమర్ పై ఆమె మండిపడుతూ ఇలా స్పందించింది.. తమిళ పరిశ్రమ ద్వారా వ్యాపించిన ఆ గాసిప్ సమంతకు పెద్ద తలనొప్పిగా మారింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ‘ఏమాయ చేశావె’ చిత్రంలో సమంత ‘లిప్ కిస్’ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే డెరైక్టర్ రూపొందిస్తున్న మరో రొమాంటిక్ చిత్రంలోనూ సమంత చేస్తోంది. త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మూడు భాషల్లోనూ సమంతనే హీరోయిన్. దాంతో ఈ సినిమాల్లో కూడా లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని, ఏకంగా మూడు భాషల్లోని ముగ్గురు హీరోలతో సమంత తన పెదవులను కలుపనున్నారని ఆ గాసిప్ సారాంశం.
ఈ గాసిప్‌పై పలు కోలీవుడ్ చానల్స్‌లో కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. తెలుగులో నాని, తమిళంలో జీవా, హిందీలో ఆదిత్యరాయ్ కపూర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇదిలావుంటే...దాంతో సమంత మీడియా ముందు ఇలా అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె రాజమౌళి 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లో నటిస్తోంది. మహేష్‌బాబుతో మరోసారి అవకాశం అందుకొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి