1 మార్చి, 2012

పోలీసుపై దౌర్జన్యం: ముఖ్యమంత్రి మేనల్లుడి అరెస్ట్

కోల్‌కతా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఆకాశ్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోల్ కతాలోని కిడ్డర్ పోరు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆకాశ్ తో పాటు మరో ఇధ్దరితో కలిసి కారులో వేగంగా విద్యాసాగర్ సేతుపై ఇష్టారీతిన ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. దీంతో డ్యాంపై భారీగా ట్రాఫిగ్ జాం అయింది. వెంటనే పోలీసు అదికారి కారును ఆపాలంటూ వారికి సూచించాడు. కానీ కారులోని ఓ వ్యక్తి పోలీసుపై దుర్భాషాలాడుతూ తాను సిఎం మేనల్లుడిని అంటూ దౌర్జన్యానికి దిగాడు. పోలీసు అధికారిని వెనక్కి నెట్టాడు.

తాను ముఖ్యమంత్రి మేనల్లుడిని అని ఆకాశ్ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. వెంటనే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. గురువారం వారిని కోర్టులో హాజరు పర్చనున్నారు. బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకే ఆకాశ్ ను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్ సెక్షన్లు నమోదు చేశారు.

కామెంట్‌లు లేవు: