1 మార్చి, 2012

బాలకృష్ణ 'అధినాయకుడు'పై చెత్త రూమర్

బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు రిలీజ్ డేట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం అవటంతో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం నిర్మాత ఈ సినిమాను విడుదల చేయటానికి తన ఇల్లుని, ప్లాట్ ని అమ్మేయటానికి రెడీ అవుతున్నారంటూ రూమర్ మొదలైంది. చిత్రం మీద చేసిన ఫైనాన్స్ వదిలించటానికే ఆస్దులు అమ్ముతున్నాడని, సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఈ రూమర్స్ ని కొంతమంది కావాలనే క్రియేట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. బడ్దెట్ ఎక్కువైన మాట వాస్తవమే అయినా బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ కు అదేమీ ఎక్కువ కాదని చెప్తున్నారు. 

బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అంటున్నారు దర్శకుడు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ... నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

కామెంట్‌లు లేవు: