అల్లరి నరేష్-శర్వానంద్ లతో కలిసి ఆమె నటించిన తాజా సినిమా నువ్వా-నేనా చిత్రం విజయవంతం కావడంపై శ్రియ ఆనందం వ్యక్తం చేసింది. కామెడీ మూవీస్ లో నేను ఇప్పటి వరకు నటించలేదు, కొత్తగా చేసిన ప్రయత్నం ఫలించింది అని చెప్పుకొచ్చింది. పెద్ద, చిన్న హీరోలు అనే తార తమ్యాలు నాకు లేవు, స్టోరి నచ్చింది చేశానంతే. శర్వానంద్, నరేష్ బెస్ట్ కో స్టార్స్ వారి పెర్ఫార్మెన్స్ నచ్చిందని శ్రియ అన్నారు. ఇన్నేళ్లయినా తెలుగు సరిగా మాట్లాడక పోవడానికి కారణం ఏమీలేదు. నాతో ఎవరైనా మట్లాడితే నేను తెలుగులోనే మాట్లాడతాను. అయితే నా తెలుగు వింటే అంతా నవ్వుకుంటారు అంది.
ప్రస్తుతం తాను ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం కోసం ఆరు నెలలుగా హోం వర్క్ జరుగుతోంది. తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఎక్కువగా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నా. అతి త్వరలోనే నేను నటించే తెలుగు సినిమా ప్రారంభం కాబోతోంది అని వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి