20 మార్చి, 2012

అనుష్క, సురేష్ రైనా మధ్య లవ్ ఎఫైర్?

 Anushka Sharma

క్రికెట్‌కు-బాలీవుడ్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంది. హీరోయిన్లు వేసే గూగ్లీలకు పలువురు క్రికెటర్లు పడి పోవడం...వారితో లవ్వాయణం కొనసాగించడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. కొందరు పెళ్లి చేసుకుని దంపతులు అయ్యారు కూడా. యువరాజ్ సింగ్ దీపిక పడుకొనె, హర్భజన్ సింగ్-గీతా బస్రా ఇలా చాలా మందే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ రాజుకున్నట్లు బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. వారు ఎవరో కాదు...అటాకింగ్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా, బ్యాండ్ బాజా బారత్ హీరోయిన్ అనుష్క శర్మ.

కొన్ని నెల క్రితం లండన్‌లో వీరిద్దరు కలుసుకున్నారని, మాట మాట కలిసి మనసులు సైతం కలిసాయని, ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోందని, డేటింగ్ చేస్తున్నారని వారి సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఇద్దరికి ఇష్టం లేదని, కొంత కాలం పాటు రహస్యంగా ‘సం’బంధం కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అనుష్క తండ్రి ఆర్మీ ఆఫీసర్. ఆయనకు క్రికెట్ ప్రముఖులతో సంబంధాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఆమె బ్రదర్ కర్నేష్ స్టేట్ లెవల్ క్రికెట్ ఆటగాడు. ఈ నేపథ్యం తమ బంధానికి అడ్డు తగులుతుందనే భయంలో అనుష్క ఉందట. 

కామెంట్‌లు లేవు: