4 మార్చి, 2012

పార్టీ పరువు కోసం కాంగ్రెస్ వ్యూహత్మక నిర్ణయం

వేటు ప్రకటన రాజ్యసభ ఎన్నికలనే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా..? ఈ ఎన్నికల్లో పార్టీ పరువును నిలుపుకునేందుకు 


                                           AA
ఎమ్మేల్యేలపై వేటు వేసిందా..? అసలు ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..? అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహమేంటి..? వేటుతో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ప్రయోజనాలేమిటి..? ఇలాంటి అంశాలపై స్పెషల్ రిపోర్ట్ .. రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారించింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వేటు వేసిన తమ పార్టీ ఎమ్మేల్యేలపై అనర్హత వేటును ఇంత కాలం నాన్చిన కాంగ్రెస్ ఎట్టకేలకు వారిపై వేటు వేసింది. 

అయితే తప్పని సరి పరిస్థితుల్లోనూ.. కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలే.. జగన్ వర్గం ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాంగ్రెస్ నానుస్తూ వస్తుండటాన్ని గమనించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్.. వేటు పడకుంటే.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.. రాజ్య సభ సీటు సాధించాలంటే కనీసం 40 మంది ఎమ్మేల్యేల మంది మద్దతు అవసరం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 17 మంది ఎమ్మేల్యేల మద్దతుతో పాటు..

టీఆర్ఎస్ ఎమ్మేల్యేల మద్దతు కూడగట్టి...రాజ్యసభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసింది. అయితే ఇదే జరిగితే కాంగ్రెస్ పరువు పోవడం ఖాయమని.. పార్టీలో క్రమశిక్షణ మరింత గాడి తప్పుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీనికి తోడు ఆ పార్టీ వచ్చే నాలుగు రాజ్య సభ స్థానాల్లో ఒకటి కోల్పోవల్సి వస్తుంది. అందుకే ఈ ప్రమాదాన్ని గుర్తించిన కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే జగన్ వర్గం ఎమ్మేల్యేలపై వేటు వేసింది. రాష్ట్రంలో ఒకేసారి 24 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడం కూడా కాంగ్రెస్ వేటుకు ఇన్నాళ్లు లేటు చేసింది. 

ఒకేసారి 24 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిపితే.. వాటిలో వచ్చే ఫలితాలు కాంగ్రెస్ కు ప్రతికూలగా ఉంటే.. వాటి ప్రభావం సర్కారుపై పడే ప్రమాదం ఉంది. అందుకే సర్కారు ముందుగా ఏడు స్థానాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల హడావిడి ఊపందుకున్నాకే.. జగన్ వర్గం ఎమ్మేల్యేలపై వేటు వేసింది. ఇప్పుడు వేటు పడిన ఎమ్మేల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడానికి మరి కొంత కాలం పట్టవచ్చు... కాబట్టి ఈ లోపు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

కామెంట్‌లు లేవు: