13వ అసెంబ్లీ రికార్డు సృష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో కేవలం మూడేళ్లలోనే 40 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతుండడం విశేషం. అనర్హత వేటుతో కొందరు, పార్టీ మారి మరికొందరు, వివిధ కారణాలతో మరిన్ని సీట్లు ఖాళీ అయ్యాయి. ఇలా సంథింగ్ స్పెషల్ గా నిలిచింది ఈసారి అసెంబ్లీ.. ప్రస్తుత 13వ శాసనసభా కాలంలో రికార్డు స్థాయిలో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. తాజాగా ఖాళీ అయిన 17 స్థానాలను కలిపితే కేవలం మూడేళ్ల వ్యవధిలో 40 స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి.
పులివెందుల స్థానానికి ఇప్పటికే రెండు సార్లు పోటీ జరిగింది. 2009 ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి చనిపోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో పులివెందులకు ఉపఎన్నిక జరిగింది. 2010లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా 10 మంది టీఆరెస్, కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజీనామా చేయడంతో 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
ఇక..2011లో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడంతో పులివెందుల అసెంబ్లీకి ఆయన తల్లి విజయమ్మ రిజైన్ చేసారు. దీంతో అక్కడ మళ్లీ బైపోల్ అనివార్యమైంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి రాజీనామా చేసి టీఈరెస్ లో చేరారు. దీంతో అక్కడ కూడా ఉపఎన్నిక జరిగింది. అలాగే.. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, మహబూబ్‌నగర్ కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్, కామారెడ్డి టీడీపీ శాసన సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి గులాబీ కండువా కప్పుకున్నారు.
వీరితో పాటు.. నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధనరెడ్డి కూడా ఎమ్మెల్యే గిరీకి గుడ్ బై చెప్పారు. అటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ కూడా ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనర్హత పిటిషన్ ఎదుర్కొంటూ పదవికి రాజీనామా చేసారు. దీంతో ఈ ఏడు సీట్లకు ఈనెల18న బైపోల్స్ జరుగుతున్నాయి. తాజాగా జగన్ వర్గానికి చెందిన 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వీరితో పాటు పీఆర్పీకి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామాకు కూడా స్పీకర్ ఆమోదం తెలపడంతో 17 స్థానాలలో త్వరలో ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది.
దీంతో ఈ శానససభలో మొత్తం 40 సీట్లకు ఉపఎన్నికలు వచ్చినట్లు లెక్క తేలింది. అయితే టీడీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనర్హత పిటిషన్ ఒక్కటే స్పీకర్ నాదెండ్ల వద్ద పెండింగులో ఉంది. గత శాసనసభలో కూడా శాసనసభ్యుల అనర్హత ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి ముగ్గురు టీఆరెస్ ఎమ్మెల్యేలపై డిస్ క్వాలిఫై వేటు వేసారు.
శాసనమండలి ఎన్నికల సమయంలో విప్ ధిక్కరించి స్వతంత్ర అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ కు 9 మంది MLAలు మద్దతిచ్చారని టీఆరెస్ ఫిర్యాదు చేసింది. వీరిలో ముగ్గురిపై వేటేయగా..మిగిలిన వారు తమ పదవులకు రాజీనామాలు చేయండతో దాన్ని స్పీకర్ ఆమోదించారు. అనర్హత విచారణ ఎదుర్కొంటూ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆమోదించడం ఆనవాయితీగా వస్తోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి