22 జూన్, 2012

సమ్మర్‌ ఎఫెక్ట్...టాప్ 3లో ఆ ముగ్గురు హీరోలు!




















ఈ సమ్మర్ తెలుగు టాప్ హీరోల జాతకాలు మార్చేసింది. సమ్మర్లో రిజలీజైన సినిమాలు, కలెక్షన్ల వివరాలను బట్టి ముగ్గురు హీరోలు టాప్ 3 పొజిషన్లోకి చేరారారు. వారే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్. ‘దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేక పోవడంతో మరో స్టార్ హీరో జూ ఎన్టీఆర్‌కు టాప్ 3లో ప్రస్తుతానికి చోటు లేదనే అంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు' సినిమాతో పెద్ద హిట్ కొట్టడంతో పాటు...‘బిజినెస్ మేన్' చిత్రం భారీ కలెక్షన్లు సాధించడంతో టాప్ 3లో తమ స్థానం పదిలం చేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రచ్చ' చిత్రం సూపర్ హిట్ కావడంతో టాప్ 3లో పాగా వేశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌తో టాప్ 3లో టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నాడు.

అయితే ఈ టాప్ పొజషన్లు ఎప్పుడూ ఒకేలా ఉంటాయనుకుంటే పొరపాటే. ఇక్కడ హిట్టు కొట్టినోడే నెం.1......కలెక్షన్ల వర్షం కురిపించినోడే బాక్సాఫీస్ కింగ్. తెలుగులో యువ హీరోలంతా టాప్ పొజిషన్ల కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. త్వరలో అల్లు అర్జున్ ‘జులాయి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే అల్లు అర్జున్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇప్పట్లో టాప్ పొజిషన్లోకి వెళ్లడం కష్టమే.

ప్రస్తుతం టాప్ పొజిషన్లోకి వచ్చే హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మాత్రమే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ చాలా పెద్దది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వీరి చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. నందమూరి టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మార్కెట్ కూడా టాలీవుడ్ బాక్సాఫీసులను శాసించే రేంజిలో ఉంటుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తుండగా, మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా' చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ తేజ్ ‘జంజీర్', ‘ఎవడు' చిత్రాలతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ దసరా, సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నాయి. మరి రాబోయే కాలంలో టాప్ 3 పొజిసన్ దక్కించుకునేది ఎవరో వేచి చూడాలి.

కామెంట్‌లు లేవు: