రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రెండు
మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో రాజమౌళి ఈగ పాత్రకు రాజమౌళి డబ్బింగ్
చెప్తున్నారని వార్తలు వచ్చాయి. అంతా రూమర్ అది కొట్టిపారేసారు. నానీ
హీరోగా ఉండే సినిమాలో రాజమౌళి ఆ పాత్రకు డబ్బింగ్ ఎలా చెప్తారని
అనుకున్నారు. అయితే అది రూమర్ కాదని నిజమేనని తేలింది. ఈ డబ్బింగ్ విషయమై
నిర్మాత ప్రకటన చేసి అందరి అనుమానాలు నివృతి చేసారు
నిర్మాత సాయి
కొర్రపాటి మాట్లాడుతూ ''ఇటీవలే రాజమౌళి ఈగ కోసం సంభాషణలు పలికారు.
ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉంటుందీ చిత్రం. విజువల్
ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి.జులై 6న ఈ చిత్రం
ప్రేక్షకుల ముందుకొస్తుంది'' అన్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ
చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.
సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రం'ఈగ'త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగ'. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కుతోంది.
అలాగే రాజమౌళి మాట్లాడుతూ "బలవంతుడైన
విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు?
అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్
అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో
ఉంటాయి'' అని అన్నారు.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని
ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం
లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్
ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని
అన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి