24 జూన్, 2012

ప్యాన్స్ దెబ్బకు మహేష్ లొకేషన్ ఛేంజ్




















మహేష్ బాబు తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగింది. అయితే అక్కడ మహేష్ అబిమానులు విపరీతంగా వచ్చారు. దాంతో ఆ లొకేషన్ లో షూటింగ్ ని హ్యాండిల్ చేయటం చాలా కష్టమైంది. ఏం చేయలేని పరిస్దితుల్లో షూటింగ్ ప్యాకప్ చెప్పి ఆ సీన్స్ ని అహ్మదాబాద్ లో షూట్ చేయటానికి ప్లాన్ చేసారు. ఇలాంటి సంఘటనలు పెద్ద హీరోలకు జరుగతూనే ఉంటాయి.

తాజాగా పపన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ హైదరాబాద్ సారిధీ స్టూడియోలో జరుగుతూంటే విపరీతంగా పవన్ అభిమానులు రావటంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ విషయమై యూనిట్ వర్గాలు వ్యాఖ్యానిస్తూ...అలాంటి సంఘటనలు పెద్ద హీరోల సినిమాలకు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఎక్సపెండిచర్,డేట్స్ రెండూ లాస్ అవుతాయి. అలాగని హీరోలను బ్లేమ్ చెయ్యలేం. దర్సకుడుకి అనుకున్న టైమ్ షెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చేయాలనే ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఈ విషయాల్లో ఎవ్వరూ ఏం చెయ్యలేం అన్నారు.

వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్‌ రాజు.

అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్‌ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

కామెంట్‌లు లేవు: