21 జూన్, 2012

ముంబైలో క్యాన్సిల్...మలేషియా వెళ్తున్న వెంకీ ‘షాడో’




















వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘షాడో'. మెహర్ రమేష్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం తదుపరి షెడ్యూల్ ముంబైలో జరుగాల్సి ఉండగా.....బాగా వర్షాలు కురుస్తుండటం, వాతావరణం అనుకూలించక పోవడంతో అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్‌గా మలేషియా షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. జులై రెండో వారంలో మలేషియాలో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇంతకు ముందు ఈ చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, స్విట్జ్రర్లాండ్‌ తదితర ప్రదేశాల్లో నిర్వహించారు. ఇందులో వెంకటేష్ ఇంటర్నేషనల్ డాన్‌గా కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.

హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని..యునైటెడ్ మూవీస్ పతాకం సింహా చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మాత. ఈ సినిమాలో కామెడీ టచ్ కూడా మెండుగా ఉంటుందని అంటున్నారు ఈచిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్. సినిమా పేరుకు తగిన విధంగానే మాఫియా బ్యాగ్రౌండ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి అతని భార్యగా నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు కూడా మరో హీరోగా చేస్తున్నాడు. దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాత.

కామెంట్‌లు లేవు: