ఎయిర్‌కండీష్‌నర్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా హోమ్‌థియోటర్లను రూపొందించటంలో
దిట్టగా పేరుగాంచిన హెయిర్ బ్రాండ్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ
విభాగంలోకి ఆరంగ్రేటం చేసింది. వాటర్‌ఫ్రూఫ్ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా
‘జింగ్ ’ పేరుతో సమర్థత కలిగిన మొబైల్‌ను హెయిర్ సంస్థ డిజైన్ చేసింది.
సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆలీబాబా ఆలీయున్’ప్లాట్‌ఫామ్ పై ఫోన్ రన్
అవుతుంది. ఈ క్లౌడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం పై ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను
సులువుగా రన్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా యూజర్ ఫ్రెండ్లీ
అనుభూతితో కూడిన వెబ్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు.
ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:
- 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800×480పిక్సల్),
- 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసింగ్ వ్యవస్థ,
- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),
- వాటర్ ప్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్, షాక్ ప్రూఫ్.
- 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసింగ్ వ్యవస్థ,
- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),
- వాటర్ ప్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్, షాక్ ప్రూఫ్.
ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొగల మల్టీపుల్ ప్రొటెక్షన్
వ్యవస్థను డివైజ్‌లో ఏర్పాటు చెయ్యటం యూజర్‌కు మరింత లబ్ధి చేకూర్చే అంశం.
హ్యాండ్‌సెట్ స్టోరేజ్ ఇతర డేటా ట్రాన్స్‌ఫర్ ఫీచర్లకు సంబంధించి పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది. ధర అంచనా రూ.8,000. చైనాలో విడుదల కానున్న
‘జింగ్’ స్టాండర్డ్ బ్లాక్ ఫ్రేమ్‌లో డిజైన్ కాబడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి