19 జూన్, 2012

'గబ్బర్ సింగ్' హైదరాబాద్ రికార్డు





















పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'రిలీజైన నాటినుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాంతో ఈ చిత్రం ఏ రేంజ్ రికార్డులు బ్రద్దలు కొడుతుందా..కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హైదరాబాద్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసి అభిమానులలో ఆనందం నింపుతోంది. హైదరాబాద్ లో ఇరవై సెంటర్లలలో యాభై రోజులు పూర్తి చేసుకుంది. కొనుక్కున్నవారంతా ఈ చిత్రం తెప్పిస్తున్న కలెక్షన్స్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మించిన 'గబ్బర్‌సింగ్' సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్ రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్ ఫంక్షన్ ఘనంగా జరపాలని గణేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరు అవుతానని మాట ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ పంక్షన్ కి పవన్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

ఇక గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జోష్ తో చేసి అదరకొట్టాడు. దబాంగ్ సినిమా నచ్చి తనే స్వయంగా నిర్మిద్దామని కొనుక్కున్నాడు. అలాగే ఎప్పుడో హరీష్ శంకర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అవకాశం ఇచ్చాడు. పవన్ నమ్మకాన్ని హరీష్ నిలబెడుతూనే..మొదటి ప్రోమో విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు పెరిగాయి. నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది అన్న ప్రోమోకి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అందుకు తగ్గట్లుగా పెరిగిన అంచనాలును నిజం చేస్తూ విడుదలైన రోజే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది.

దర్శకుడు హరీష్ శంకర్ ...ఈ సినిమా సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ... సినిమా అనేది ప్రేక్షకులందరికీ నచ్చాలి. అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేశాను.''అన్నారు హరీష్‌ శంకర్‌. ఇక ''హిట్టు..ప్లాప్ లను నమ్ముకొని నేను పరిశ్రమకు రాలేదు. కేవలం పనిని నమ్ముకొని వచ్చాను. వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే... ఒక దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.

కామెంట్‌లు లేవు: