21 జూన్, 2012

ఆ హీరోతో రాత్రంతా బీచ్‌లో కాజల్ ఎంజాయ్!




















నిన్న(జూన్ 19) పుట్టిన రోజు జరుపుకున్న హీరోయిన్ కాజల్ గోవా బీచ్‌లో రాత్రంతా తనివితీరా ఎంజాయ్ చేసింది. బీచ్‌లో ఆమెకు కంపెనీ ఇచ్చింది ఎవరో తెలుసా...? ఇంకెవరు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘తుపాకి' హీరో విజయ్. కాజల్ పుట్టిన రోజు కావడంతో విజయ్ దర్శకుడిని రిక్వెస్ట్ చేసి నిన్నంతా షూటింగ్ రద్దు చేయించాడు. ప్రస్తుతం గోవా బీచుల్లో ఈ షూటింగ్ జరుగుతోంది. విజయ్ అంతలా కోరడం ముగదాస్ కూడా కాదనలేక పోయాడు. దీంతో బీచ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకుని ఎంజాయ్ చేశారు.

ఇక ‘తుపాకి' వివరాల్లోకి వెళితే...ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తన పంథాకు భిన్నంగా మురుగదాస్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

కాజల్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో శ్రీను వైట్ల దర్శకత్వంలో జూ ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతోన్న ‘బాద్ షా' చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా రామ్ చరణ్ తేజ హీరోగా వివి వినాయక్ రూపొందిస్తున్న చిత్రంలో, మహేష్ బాబు హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రాతో పాటు తమిళంలో సూర్య హీరోగా కె.వి. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాట్రాన్ చిత్రంలో, విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న తుపాకి చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు ఓ హిందీ చిత్రంలోనూ, మరో తమిళ చిత్రంలో కాజల్ అవకాశం దక్కించుకుంది.

కామెంట్‌లు లేవు: