ప్రేమలో ఉన్నప్పుడు టాటూ వేసుకున్నా.... ఇంకేది వేసుకున్నా అది తీపి
గుర్తే. కానీ విడిపోయాక ఆ తీపి గుర్తులు కాస్త మరకలుగా మారుతాయి. తాజాగా
నయనతార పరిస్థితి అదే. కొంతకాలం క్రితం వరకు ప్రభుదేవాతో పీకల్లోతు
ప్రేమాయణం నెరపిన నయనతార కచ్చితమైన కారణాలేంటో తెలియదు కానీ....పెళ్లిదాకా
వచ్చిన వీళ్ల బంధం పెళ్లికి ముందే పెటాకులైంది.
విడిపోయిన తర్వాత నయన తన చేతిపై వేయించుకున్న ప్రభుదేవా టాటూను
ప్లాస్టిక్ సర్జీరీ ద్వారా తుడిచేయించుకుంటుందని భావించినా.... తాను
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లేదని, ఆ టాటూనే తొలగించుకోవడం లేదని,
అలాగని ప్రభుదేవాతో
మళ్లీ కలిసే ప్రసక్తి కూడా లేదని స్పష్టం చేసింది. ఏ కారణంతో ఆ టాటూ అలానే
ఉంచుకుందో తెలియదు కానీ...పబ్లిక్ ఫంక్షన్లకు హాజరైనప్పుడు దాన్ని
కనిపించకుండా కవర్ చేసుకుంటూ వస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో అవార్డుల
ఫంక్షన్ జరినప్పుడు హాజరైన నయనతార ఆ టాటూ కవర్ అయ్యేలా డ్రెస్
చేసుకోవడమేకాదు.....చున్నీతో కూడా దాన్ని కనిపించకుండా చేసే ప్రయత్నం
చేసింది. అది మళ్లీ మీడియా కంట పడితే దాని గురించి రచ్చ రచ్చ చేస్తారనే
భయంతోనే నయన ఇలా చేసినట్లు స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం నయనతార పలు
తెలుగు, తమిళం ప్రాజెక్టులో బిజీగా గడుపుతోంది. నాగార్జున, దశరత్
కాంబినేషన్లో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా
నటిస్తోంది. ఇవే కాకుండా రాణా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న
చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్, నయనతార
కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
మరో వైపు ‘భూలోగం' అనే తమిళ చిత్రానికి సంబంధించి ఇటీవలే దర్శక నిర్మాతలు
ఆమెను సంప్రదించారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ కృష్ణ దర్శకుడిగా పరిచయం
అవుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి