హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ
(ఐటి) కంపెనీలకు ఆల్ ఖైదా నుంచి మప్పు ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
నుంచి హెచ్చరికలు అందాయి. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర
ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. సైబరాబాదులోని బహుళజాతి సంస్థల కంపెనీలకు
ఆల్ ఖైదా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు సమాచారం అందింది.
ఐటి
కంపెనీల వంటి సంస్థలపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోం
మంత్రిత్వ శాఖకు నిఘా విభాగాలు సమాచారం అందించినట్లు, ఆ సమాచారాన్ని
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి చేరవేసినట్లు వార్తలు
వచ్చాయి. గుజరాత్‌లో కచ్ సరిహద్దుల మీదుగా ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరులు
దేశంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ
శాఖ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇతర
రాష్ట్రాల్లోని బహుళజాతి సంస్థల కంపెనీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని
రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, హెవిలెట్ పకార్డ్
వంటి సంస్థలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని తెలిపినట్లు వార్తలు
వచ్ాచీయి.
ఐటి సంస్థలకు కల్పించిన భద్రతపై సమీక్ష
చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి పంకజ్ ద్వివేదీ పోలీసు
ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసుల భద్రతతో పాటు అంతర్గతంగా భద్రతా
ఏర్పాట్లు చేసుకోవాలని ఐటి సంస్థలకు సూచించాలని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి