హీరోయిన్ తాప్సీకి
కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలు లేక పోయినా....సినిమా ఆఫర్లు మాత్రం
వెల్లువలా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అమ్ముడు డేట్స్ అడ్జెస్ట్
చెయ్యలేక సినిమాలనే వదులు కోవాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం
చేసుకోవచ్చు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దక్షిణాది సినిమాల్లో
తాప్సీకి ఉన్న డిమాండ్.
ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘ఆడుకాలం' తర్వాత
తమిళంలో తాప్సీ ఓ భారీ చిత్రాన్ని అంగీకరించింది. విశాల్ కథానాయకుడిగా
నటించనున్న ఈ సినిమాకు సుందర్.సి దర్శకుడు. ఇందులో విశాల్‌కు జోడీగా ముందు
కార్తీకని కథానాయికగా ఎంపిక చేయాలనుకున్నారు.
అయితే కథానాయిక పాత్ర
గ్లామరస్‌గా వుండటం వల్ల కార్తీకని తప్పించి చివరికి ఆ స్థానంలో తాప్సీని
హీరోయిన్‌గా ఖరారు చేసుకున్నారు దర్శకుడు సుందర్.సి. కానీ డేట్స్ సమస్య
కారణంగా తాప్సీ ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలో
శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మిని దర్శకుడు సుందర్ ఎంపిక చేసుకున్నాడు.
ఈ
విషయమై తాప్సీ మాట్లాడుతూ ‘ఓకే సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలంటే
ఎలాంటి స్టార్‌కైనా ఇబ్బందికరంగానే వుంటుంది. నాకూ ఇదే తరహా సమస్య
సుందర్.సి చిత్రం ‘మధ గజ రాజా'కు ఎదురైంది. పైగా తెలుగు, హిందీ భాషల్లో
నేను నటిస్తున్న గుండెల్లో గోదారి, షాడో, చష్మేబద్దూర్ చిత్రాలకు ఈ సినిమా
కారణంగా డేట్స్ సమస్య తలెత్తే అవకాశం వుంది. అందువల్లనే విశాల్‌తో
చేయాల్సిన తమిళ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది' అని తెలిపింది.
తాప్సీ
ఇటీవల రవితేజతో జంటగా నటించిన ‘దరువు' చిత్రం ప్లాప్ అయిన విషయం
తెలిసిందే. ఆమె అంతకు ముందు తెలుగులో నటించిన సినిమాలన్నీ ప్లాపు
చిత్రాలుగానే మిగిలాయి. సాధారణంగా ప్లాపు హీరోయిన్లను పక్కన పెట్టే తెలుగు
దర్శక నిర్మాతలు, తాప్సీ విషయంలో మాత్రం ఆమె గ్లామర్‌కి ఫిదా అయిపోయినట్లు
స్పష్టం అవుతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి