25 జూన్, 2012

పూరీ మీద పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి?





















పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులు ఆడియో పంక్షన్ జరుగుతూంటే ...పవన్ అబిమానులు ...తమ రాంబాబు గురించి నినాదాలు చేసారు. అప్పుడు పూరీ రాంబాబు ని డైరక్ట్ చేయటానికి తాను ఫంక్షన్ అయ్యాక వెళ్లతానని నవ్వుతూ చెప్పారు. ఇది ప్రక్కన పెడితే పవన్ అబిమానులు దృష్టి మొత్తం ఇప్పుడు పూరీ జగన్నాధ్ మీదే ఉంది.

దేముడు చేసిన మనుష్యులు ట్రైలర్,ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా లేకపోవటంతో రాంబాబు ని బాగా చేయాలని వారు మెసేజ్ లు ద్వారా,ట్వీట్స్ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ చిత్రం చాలా కాలం గ్యాప్ తర్వత పవన్ కి తిరుగులేని హీరోగా హిట్ ని ఇచ్చి నిలబెట్టింది. ఈ నేపధ్యంలో వారు దృష్టి మొత్తం పవన్ తదుపరి చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు పైనే ఉంది. అందుకే్ స్టీరియో టైప్ పాత్రలుతో కాకుండా,కొత్తగా పూరీ జగన్నాధ్ తమ హీరోని చూపించలాని కోరుతున్నారు.

ఇక పూరీ సైతం పవన్ తో పెద్ద హిట్ కొడతానని నమ్మకంగా చెప్తున్నారు. మీడియా నేపధ్యంలో జరిగే ఈ కథలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ గా కనపించనున్నాడని సమాచారం. పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.

తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.

కామెంట్‌లు లేవు: