25 జూన్, 2012

'స్టెమ్‌ సెల్స్‌'ప్రచారంలో మహేష్ దంపతులు

















మహేష్ ఆయన బార్య నమ్రత త్వరలో ఓ సామాజిక కార్యక్రమాన్ని చేపట్టుబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గర్బవతిగా ఉన్న నమ్రత బిడ్డను ప్రసవించగానే ఈ దంపతులు ఇద్దరూ స్టెమ్ సెల్స్ గురించి,వాటి భద్రత గురించి,వాటి ప్రధాన్యత గురించి ప్రచారం చేయటానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇక 'స్టెమ్‌ సెల్స్‌'విషయానికి వస్తే...ఎక్కువగా 'ఎముక మూలుగు' (బోన్‌ మ్యారో) లో ఉంటాయి. ఇటీవల పరిశోధనలో గర్భస్థ శిశువుకు తల్లికి అనుసంధానం చేసే బొడ్డుతాడులోని రక్తంలో ఇవి ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. ఇవి మనిషిలో రోగనిరోధక శక్తిని నిర్మిస్తాయి. రక్తాన్ని పుష్టివంతం చేస్తాయి. గర్బస్థ శిశువు జన్మించడంతో బొడ్డుతాడును కోసేస్తారు. అలా చేయడం వల్ల ఈ తాడు రక్తంలోని స్టెమ్‌సెల్స్‌ను సురక్షితంగా ఉంచలేదు.

ప్రసవానంతరం బిడ్డ బొడ్డుతాడు కోసం వెంటనే ఆలశ్యం చేయకుండా ఆ రక్తాన్ని సేకరించి భద్రపరచాలి. దానికి ఎటువంటి రోగాణువులు తగలకూడదు. దీని వల్ల తల్లికి, బిడ్డకు ఏరకమైన ప్రమాదం లేదా ఇబ్బంది ఉండదు. ఇప్పటికే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా బొడ్డుతాడు రక్తం సేకరించి భద్రపరుస్తున్నారు. దీనినే 'ప్యాథ్‌ కేర్‌' బ్యాంక్‌ అంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఈ 'ప్యాథ్‌ కేర్‌' బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. వీటిని మహేష్ ప్రమోట్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు...వెంకటేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో చేస్తున్నారు.'సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌'చిత్రం ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా చేస్తున్నారు. సమంత,అంజలి, జయసుధ, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రధారులు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్‌లో ప్రధాన తారాగణంపై కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

రోహిణి, రావు రమేష్‌, ఆహుతిప్రసాద్‌, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు ఇతర పాత్రధారులు. సహనిర్మాత: శిరీష్‌, లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌,పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్‌.

కామెంట్‌లు లేవు: