ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన హీరోయిన్ ‘సదా' వరుస
ప్లాపుల నేపథ్యంలో చాలా డల్ అయి పోయింది. చాలా కాలంగా సదాకి తెలుగులో ఒక్క
అవకాశం కూడా రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత సదా మళ్లీ తెలుగు తెరపై
కనిపించబోతోంది.
వివరాల్లోకి వెళితే... తెలుగు యంగ్ హీరో నవదీప్ త్వరలో ‘మైత్రి' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈచిత్రంలో హీరోయిన్‌గా సదాను
ఎంపిక చేశారు. ఈచిత్రం ద్వారా రాజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా వికాస్
సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈచిత్రం లాంచనంగా ప్రారంభం అయింది.
త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం నవదీప్ శంకర్
మార్తాండ్ అప్ కమింగ్ మూవీ ‘పొగ' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. నిర్మాత
కూడా శంకర్ మార్తాండే వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రణధీర్, బిందు మాధవి
మరియు సౌమ్యలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ శంకర్
సంగీతం అందిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ‘పొగ' రూపొందిస్తున్నారు.
ఆమధ్య
చిత్తుగా తాగి పోలీసులకు పట్టుబడి కోర్టుల చుట్టూ తిరిగిన నవదీప్...తన
బ్యాడ్ వ్యవహారాన్ని అంతా మరిచిపోవాలని చాలా కాలంగా సలెంట్ అయిపోయాడు.
సినిమా ఫంక్షన్లలో కూడా పెద్దగా ఎక్స్ ఫోజ్ కావడం లేదు. మీడియాకు కనీసం
ముఖం కూడా చూపించడం లేదు. ఓ మంచి సినిమా ద్వారా ప్రేక్షులను మెప్పించాలనే
కసితో ఉన్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి