హీరోయిన్ కాజల్ అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్
హీరోగా రూపొందుతోన్న ‘బాద్ షా' చిత్రం కోసం ఓ సాహసం చేయబోతోంది. ఇప్పటి
వరకు తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం కూడా రాని ఈ చిత్రం బ్యూటీ
ఏకంగా ఈచిత్రంలో ఓ పాట పాడబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇందుకోసం ఆమెకు
ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడట. గతంలో తమన్ మహేష్ బాబు, పూరిలతో
బిజినెస్ మేన్ చిత్రంలో పాట పాడించిన విషయం తెలిసిందే.
జూ
ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో
మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్
ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం ప్లస్సవుతుందని
భావిస్తున్నారు.
ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్
సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్
సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి
పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు
చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
‘బాద్
షా' చిత్రం పూర్తి స్ధాయి కామిడీ మరియు యాక్షన్ ఫార్ములాతో
రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కొంత కాలంగా ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో
ప్రచారమవుతోంది. ‘బాద్ షా'చిత్రం హిందీలో సూపర్ హిట్టైన సింగ్ ఈజ్ కింగ్‌కి
కాపీ అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ఈ చిత్రాన్ని
బండ్ల గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి