25 జూన్, 2012

పవన్ మీద అభిమానంతోనే నితిన్ ఆ టైటిల్




















పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నితిన్ ఇష్క్ ఆడియో పంక్షన్ కి సైతం పవన్ వచ్చి అతని అభిమానానికి సార్దకత చేకూర్చారు. అయితే ఇప్పుడు నితిన్ ఓకే చేసిన తన కొత్త సినిమా టైటిల్ కొరియర్ బోయ్ కల్యాణ్. ఆ టైటిల్ ఓకే చేయటానికి కారణం పవన్ కళ్యాణ్ పేరుని గుర్తు తెచ్చేలా కళ్యాణ్ అని చివరలో రావటమే అని చెప్పుకుంటున్నారు. పవన్ సెంటిమెంట్ తో పెట్టిన టైటిల్ కాబట్టి తనకు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నాడు.

ఘర్షణ, ఏం మాయ చేశావే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన గౌతమ్‌మీనన్‌, ప్రస్తుతం నాని, సమంతాలతో ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని తర్వాత నితిన్‌ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ చిత్రానికి ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ' అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రీచాను హీరోయిన్ గా ఎంపిక చేశారు.

అలాగే ఈ చిత్రం ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రేమ్ సాయి గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించనున్నారు. ఈ నెలలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. తన సినిమా పూర్తయ్యేలోగా గౌతం మీనన్ దర్శకత్వం వహించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రం విడుదలౌతుంది. కాబట్టి, ఆ సినిమా సక్సెస్‌ ప్రభావం తన సినిమాపై పడుతుందని నితిన్‌ భావిస్తున్నాడని చెబుతున్నారు.

నితిన్ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ బ్యానర్లో శృతిహాసన్‌ హీరోయిన్ గా ఓ సినిమాతో పాటు.....శ్రేష్ట మూవీస్‌ బ్యానర్‌పై నిత్యామీనన్‌ జంటగా మరో సినిమా చేయనున్నాడు. మరో ప్రక్క నితిన్ తో వీడు తేడా డైరక్టర్ సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం నిర్మించనున్నారు. పూర్తి కామిడీతో సాగే ఈ చిత్రం నితిన్ కి మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు: