‘అరుంధతి'చిత్రంతో తాను గ్లామర్ పాత్రలే కాదు నటనకు అవకాశమున్న పాత్రలను
చేసి ఒప్పించగలనని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ అనూష్క. తాజాగా ఆమె ‘ఇరండామ్
ఉలగమ్'లో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి
కాగా, రెండవది ఆటవిక యువతి పాత్ర. గృహిణిపాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక
పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళ మీడియా అంటోంది.
అనుష్క
మాట్లాడుతూ- ‘‘ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను.‘అరుంధతి'
తర్వాత నాకు అంతకన్నా గొప్ప పేరును తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త
అనుష్కను చూస్తారు. ద్విపాత్రాభినయం చేయడం నాకు కొత్తేం కాదు. అరుంధతి,
పంచాక్షరి చిత్రాల్లో ఇప్పటికే ద్విపాత్రలు చేశాను. కానీ ఆ చిత్రాలకు
పూర్తి భిన్నంగా ఇందులోని నా పాత్రలు సాగుతాయి. ఇంత మంచి పాత్రలను ఇచ్చి
ప్రోత్సహించిన సెల్వరాఘవన్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ఆటవిక యువతిగా అనూష్క
ఎన్నో రేర్ ఫీట్స్ చేయాల్సి వుంది. భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కూడా
పాల్గొనాల్సి ఉంది. ఆ పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్
నేర్చుకుంటున్నారు. ఈ పాత్ర అనుష్క కెరీర్‌లోనే ఒక మైలురాయిగా
నిలిచిపోతుంది అన్నారు. ఈ పాత్ర కోసం అనుష్క గత కొన్నాళ్లుగా మార్షల్
ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇక ఈ ‘ఇరండామ్ ఉలగమ్' సినిమాలో అనూష్క
సరసన హీరో ఆర్య చేస్తున్నారు.
తెలుగులో అనూష్క ..నాగార్జున సరసన
ఢమరకం చిత్రంలో కనపించనుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ
చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.మూవీ మేరర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఇందలో అనూష్క పాత్ర ..అరుంధని పోలి ఉంటుందంటున్నారు. నాగార్జున ఆటో డ్రైవర్
గా కనిపించే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధానపాత్రను పోషించనున్నాయి.
మరోపక్క కొరటాల శివ రూపొందిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం 'వారధి'లో కూడా ఈ యంగ్ రెబల్ స్టార్‌తో రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాగార్జున తాజా చిత్రం 'ఢమరుకం'లోను 'అలెక్స్ పాండియన్'లో కార్తీ, 'తాండవం'లో విక్రంతోనూ నటిస్తోంది.
మరోపక్క కొరటాల శివ రూపొందిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం 'వారధి'లో కూడా ఈ యంగ్ రెబల్ స్టార్‌తో రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాగార్జున తాజా చిత్రం 'ఢమరుకం'లోను 'అలెక్స్ పాండియన్'లో కార్తీ, 'తాండవం'లో విక్రంతోనూ నటిస్తోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి