16 జూన్, 2012

కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన ఆంటీ అయిపోతానా?

                                                           


అందాలభామ లక్ష్మీరాయ్ మంచి గుస్సమీదున్నారు. ఇటీవల ఆమెపై వచ్చిన కొన్ని కామెంట్లే అందుకు కారణం. ‘అధినాయకుడు’లో బాలకృష్ణ పక్కన లక్ష్మీరాయ్ బాగానే ఉన్నా, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ‘ఆంటీ’లా అనిపించిందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారట. ఈ కామెంట్లు ఆ చెవినా ఆ చెవినా పాకి చివరకు లక్ష్మీరాయ్ చెవిన పడ్డాయి. అంతే ఈ ముద్దుగుమ్మ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

‘‘కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన ఆంటీ అయిపోతానా? మనసును బాధపెట్టే విధంగా కామెంట్లు ఉండకూడదు. నా హైట్, పర్సనాలిటీ నాలోని ప్రధాన ఆకర్షణలు. గ్లామర్ విషయంలో నాతో పోటీ పడే సత్తా ప్రస్తుతం ఏ హీరోయిన్‌కీ లేదు. ఇది కాన్ఫిడెన్స్‌తో చెబుతున్న మాట’’ అన్నారు లక్ష్మీరాయ్. ఇంకా మాట్లాడుతూ -‘‘‘అధినాయకుడు’లో నా పాత్రకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది.

కేవలం గ్లామర్‌కి మాత్రమే కాక, అభినయానికి కూడా ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేశాను. బాలకృష్ణగారితో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా పాత్రను దర్శకుడు మలిచిన తీరు అభినందనీయం’’ అని చెప్పారు లక్ష్మీరాయ్.
  

కామెంట్‌లు లేవు: