16 జూన్, 2012

బన్నీతో సంచలనానికి సిద్ధమౌతున్న పూరి!

                                           Puri Jagannath Complete Allu Arjun Movie


‘బిజినెస్ మేన్' చిత్రాన్ని తక్కువ కాలంలోనే పూర్తి చేసి హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ విమర్శల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి సంచలనమే సృష్టించడానికి రెడీ అవుతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్ ఈ సారి బన్నీతో కలిసి ఈ ఫీట్ చేయబోతున్నాడు.
ఫిల్మ్ నగన్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు....‘జులాయి' చిత్రం తర్వాత బన్నీ-పూరి కాంబినేషన్లో ఓ మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘దేశముదురు' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదే రేంజి సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట పూరి. ఈ మేరకు పక్కా ప్లానింగుతో పూరి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని చేస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ జూన్ 15న సారథి స్టూడియోలో ప్రారంభం అయింది. తమన్నాహీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ బన్నీతో చేయబోయే చిత్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఇక అల్లు అర్జున్, ఇలియానా జంటగా, సూపర్ టేకింగ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కే. రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'జులాయి' జులై 6న విడుదలకు సిద్ధం అవుతోంది. జీవితాన్ని తేలిగ్గా తీసుకునే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి.

కామెంట్‌లు లేవు: