ప్రస్తుతం చాలా స్క్రిప్టులు మొదట బ్రహ్మానందం పాత్ర అనుకునే తర్వాత కథ
రాసుకుంటున్నారు. అందులోనూ బ్రహ్మానందంకు ఓ డిఫెరెంట్ నేమ్ ను కూడా ఫఇక్స్
చేసుకుంటున్నారు. తాజాగా జె.డి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న 'ఆల్ ది
బెస్ట్'చిత్రంలో బ్ర్హహ్మానందంకు గోచి సావిత్రి అనే పేరు పెట్టారు. ఆ పాత్ర
బాగా పేలుతుందని జెడీ చెప్తున్నారు.
శ్రీకాంత్, జేడీ చక్రవర్తి
కథానాయకులుగా నటించిన చిత్రం 'ఆల్ ది బెస్ట్'. లక్కీ శర్మ హీరోయిన్ గా
చేసిన ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ
-‘‘రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. చాలా
కాలం తర్వాత నేను, శ్రీకాంత్ కలిసి పనిచేసిన ఈ చిత్రం తప్పకుండా విజయం
సాధిస్తుందని నా నమ్మకం. శ్రీకాంత్ పాత్ర చిత్రణ భిన్నంగా ఉంటుంది. నటుడిగా
శ్రీకాంత్‌కీ, దర్శకుడిగా నాకూ సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఇటీవల
విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా విజయంపై నమ్మకం బలపడింది.
హేమచంద్రకు సంగీత దర్శకుడిగా మంచి ప్రారంభం అవుతుందీ సినిమా'' అని
తెలిపారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ "మంచి హ్యూమర్ టచ్ ఉన్న సినిమా. 'వన్
బై టూ', 'ఎగిరే పావురమా' తర్వాత నేనూ జేడీ కలిసి చేసిన సినిమా. అతని
దర్శకత్వంలో చేయడం కొత్తగా ఉంది. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సినిమా
విడుదల కోసం ఎదురుచూస్తున్నాను'' అని అన్నారు.
నిర్మాత సాంబశివరావు
మాట్లాడుతూ "ఈ నెల 29న సినిమాను విడుదల చేస్తున్నాం. పాటలకు మంచి స్పందన
వచ్చింది'' అని తెలిపారు. "ఎగిరే పావురమా సమయంలో దర్శకత్వం చేయాలనే ఆలోచనను
శ్రీకాంత్ నాలో నాటాడు . 'ఆల్ ది బెస్ట్' కథ చెప్తానంటే 'అవసరం లేదు.
నిన్ను నమ్మి చేస్తాను' అన్నాడు. ఆడియోకి రెస్పాన్స్ బావుంది. సినిమా
ఔట్‌పుట్‌కి వెరీ హ్యాపీ. కంప్లీట్ ఎంటర్‌టైనర్. బ్రహ్మానందం గోచి
సావిత్రి అనే పాత్రను చేశారు. ఇప్పటి వరకు సినిమాకి కథనం ముఖ్యమని నమ్మాను.
ఈ సినిమాలో కథ కూడా ముఖ్యమని తెలుసుకున్నాను. ఇది కథ ఉన్న సినిమా'' అని
దర్శకుడు జేడీ చక్రవర్తి చెప్పారు.
చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
రఘుబాబు, కృష్ణభగవాన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, రావు రమేష్, రంగనాథ్,
జీవా, సుత్తివేలు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు:
కృష్ణమోహన్ చల్లా, కెమెరా: జి.శివకుమార్, సంగీతం: హేమచంద్ర, కూర్పు: ఎడిటర్
మోహన్, నిర్మాణం: సుధా సినిమా

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి