22 జూన్, 2012

'SMS'తో కమిటైన వరుణ్ సందేశ్




















హ్యాపీడేస్ తో పరిచయమైన వరుణ్ సందేశ్ అదే తరహా రొమాంటిక్ డ్రామాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా మహేష్ బావ సుధీర్ తో 'SMS' చిత్రం రూపొందించిన దర్శకుడు తాతినేని సత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ సందేశ్ తో చమ్మక్ చల్లో చిత్రం నిర్మిస్తున్న డిఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. వరుణ్ సందేశ్..'SMS' చిత్రం డీల్ చేసిన విధానం నచ్చి ఈ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం నీలకంఠ దర్సకత్వంలో వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తైన వెంటనే ఈ సినిమా మొదలవుతుంది. వరసగా వరుణ్ సందేశ్ సినిమాలు కుదిరితే కాఫీ కప్పు, బ్రహ్మిగాడి కథ,ప్రియుడు భాక్సాఫీస్ వద్ద పెయిలయ్యాయి. ఈ నేపధ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నానని వరుణ్ సందేశ్ అంటున్నారు. ఇక దర్శకుడు తాతినేని సత్య ఇప్పటికి వరకూ రెండు సినిమాలు చేసారు. అవి భీమిలీ కబడ్డి జట్టు,ఎస్.ఎమ్.ఎస్. అయితే ఈ రెండూ తమిళ రీమేక్ లు కావటం విశేషం. అయితే ఈ సారి స్టైయిట్ కథ అని చెప్తున్నారు.

అలాగే త్వరలో వరణ్ సందేశ్...వెండి తెరవై వీర్య దానం చేస్తూ కనిపించనున్నాడని సమాచారం. ‘స్నేహగీతం', ‘ఇట్స్‌మై లవ్‌స్టోరీ' చిత్రాల దర్శకుడు ‘మధుర' శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ‘దానకర్ణ'చిత్రం కోసం వరుణ్ సందేశ్ ని హీరోగా అడిగి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.‘చెన్నైకి చెందిన ఓ జంట ఐఐటి ర్యాంకర్ వీర్యాన్ని దానం చెయ్యమని ఇంట్నట్‌లో పోస్ట్ చేశారని, ఈ సంఘటనతో పాటు తను చదివిన మరికొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు ‘మధుర' శ్రీధర్ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నాడని చెప్తున్నాడు.

ఈ చిత్రాలతో పాటు కుమార్ బ్రదర్స్ నిర్మాతగా చమక్కు అనే చిత్రం చేస్తున్నారు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత నంద్యాల రవి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హాలీవుడ్ చిత్రం హాంగోవర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెన్నెల కిషోర్, ప్రసాద్ బార్వే, వినయ్, సత్యం రాజేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సమర్పణ: సుధీర్ దొడ్డ, సహనిర్మాత: పాండు, సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ.

కామెంట్‌లు లేవు: