పవన్ కళ్యాణ్,పూరి జగన్నాధ్ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు ప్రారంభమైన
సంగతి తెలిసిందే. ఈ ఆనందాన్ని ట్విట్టర్ లో పూరీ జగన్నాధ్ పంచుకుంటూ...ఈ
రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు లో పవన్ కళ్యాణ్ చెప్పిన సింగిల్ షాట్ డైలాగ్
కెవ్వు కేక అంటూ ట్వీట్ చేసారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో
డైలాగులు పంచ్ లతో వాస్తవ పరిస్దితులకు అద్దం పట్టేటట్లు సాగుతాయని
చెప్తున్నారు.
యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొన్న శుక్రవారం మొదలైంది. ఈ విషయాన్ని పూరి
జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘‘కెమెరామేన్ గంగతో రాంబాబు'
షూటింగ్ శుక్రవారం మొదలైంది. పవన్‌కళ్యాణ్ మంచి మూడ్‌లో షూటింగ్‌లో
పాల్గొన్నారు. ఇందులో విలన్‌గా నా డార్లింగ్ ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు''
అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా
నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ
రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.
పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న
గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు,సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్ : యూనివర్సల్ మీడియా
నటీనటులు:పవన్ కళ్యాణ్,కాజల్ అగర్వాల్,ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి