ప్రియురాలి కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్న జస్టిన్ బైబర్
టీనేజి సింగింగ్ సెన్సేషన్ జస్టిన్ బైబర్ తన ప్రియురాలు సెలీనా గోమెజ్‌తో ఏకాంతంగా టోరోంటోలో గడిపేందుకు గానుహెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడని సమాచారం. టోరోంటో సిటీలో ప్రస్తుతం జరుగుతున్న మచ్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఈ జంట.. మ్యూజిక్ రిహార్సల్స్‌ని ప్రక్కకు పెట్టి మరీ రొమాంటిక్ రైడ్‌కు ఈ హెలికాప్టర్‌లో వెళుతున్నారు.
18 సంవత్సరాల వయసు కలిగిన జస్టిన్ బైబర్ గత కొంత
కాలంగా 19 సంవత్సరాల వయసు కలిగిన సెలీనా గోమెజ్‌తో రొమాన్స్ చేస్తున్న
విషయం తెలిసిందే. టోరోంటో చుట్టుప్రక్కల ఉన్న స్ట్రాట్ఫోర్డ్, ఒంటారియో
నగరాలను వీక్షించేందుకు గాను శనివారం ఓ హెలికాప్టర్‌ను అద్దెకు
తీసుకున్నారు. దైనందిన జీవితంలో చేస్తున్న పని నుండి రిలాక్స్ అయ్యేందుకు
గాను, హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోని ఆకాశంలో చక్కెర్లు కొట్టారని బైబర్
అధికార ప్రతినిధి తెలిపారు.
ఇటీవల జస్టిన్ బైబర్ ఓ ఫోటోగ్రాఫర్‌తో
ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళితే
జస్టిన్ బైబర్ తన ప్రియురాలైన సెలీనా గోమెజ్ ఇద్దరూ కలిసి కామన్స్ లో ఉన్న
కాలబాసాస్ షాపింగ్ సెంటర్‌కు రావడంతో వీరిని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ తన
వద్దనున్న కెమెరాతో ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో జస్టిన్ బైబర్
కోపోద్రేక్తుడై అతనిని తిట్టడంతో పాటు అతనిపై చేయి కూడా చేసుకున్నాడని
నివేదికల ద్వారా తెలిసింది.
జస్టిన్ బైబర్ చేతిలో దెబ్బలు తిన్న
ఫోటోగ్రాఫర్ ఆ తర్వాత 911ఫోన్ చేసి ఎగువ మొండెంపై దెబ్బలు తగినట్లుగా
కంప్లైంట్ చేశాడు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించగా.. కొన్ని
గంటల తర్వాత అతనిని ఆస్పత్రి నుండి విడుదల చేశారు. అదే సమయంలో
ఉన్నతాధికారులు వచ్చే సరికే అక్కడ నుండి జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్
ఇద్దరూ జారుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి