చిత్తుగా తాగి అర్ధరాత్రి పూట నడి రోడ్డు పైన కారులో ఒంటిపై బట్టలు
లేకుండా రాసలీలలకు పాల్పడుతున్న రెండు జంటలను హైదరాబాదు పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు. నగ్నంగా కారులో ప్రయాణించడమే కాకుండా, కారును ఆపిన
పోలీసులపై దాడికి దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు
మహిళలు, ఇద్దరు యువకులు ఉన్నారు. సోమవారం రాత్రి మెహిదీపట్నంలో హుమాయున్
నగర్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
తనిఖీలలో భాగంగా
మెహిదీపట్నం రహదారిలో వెళ్తున్న వీరి కారును పోలీసులు తనిఖీ చేశారు. దీంతో
వారి బాగోతం బయటపడింది. నలుగురిలోని ఇద్దరు యువకులతో పాటు మరో యువతి
సాఫ్టువేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారని తెలుస్తోంది. మరో యువతి కాల్
గర్ల్ అని తెలుస్తోంది. మెహిదీపట్నం రోడ్డులో తనిఖీలలో భాగంగా ఓ చెవలెట్
కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు.
పోలీసులు
వెంబడించి ఆ కారును పట్టుకున్నారు. కారును ఆపిన పోలీసులపై వారు
తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కారులో ఉన్న కాల్ గర్ల్ పోలీసులను తిడుతూ
వీరంగం సృష్టించింది. ఫుల్‌గా తాగి ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో తెలియని
పరిస్థితులలో వారు ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు.
వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు.
వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి ఆ తర్వాత కోర్టుకు రిమాండ్ చేశారు.
అందులో ముగ్గురు సాఫ్టువేర్ ఇంజనీర్లు కాబట్టి వారి భవిష్యత్తు దృష్ట్యా
వారి వివరాలు పూర్తిగా అందించలేక పోతున్నట్లు తెలుస్తోంది. కాగా తాము
మొదటిసారి తప్పు చేశామని, తమను వదిలేయమని నిందితులు పోలీసులను
వేడుకున్నారు.

1 కామెంట్:
Sure they are supporters of YSRCP.
కామెంట్‌ను పోస్ట్ చేయండి