22 జూన్, 2012

'రక్త చరిత్ర' లాగానే ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’




















రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర'తరహాలో గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో మరో బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్'తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఐదు గంటల ఇరవై నిముషాల ఉన్న ఈ చిత్రం 'రక్త చరిత్ర'లాగానే రెండు పార్ట్ లుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 22 న విడుదల చేసేందుకు ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు.

కేన్స్ పిల్మ్ పెస్టివల్ లో అందరి ప్రసంసలు పొందిన ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' చిత్రం జార్ఖండ్ లోని ఓ చిన్ని గ్రామంలో జరుగుతుంది. అక్కడి కోల్ మాఫియా నేపధ్యంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఇరవై ఐదు పాటలు ఉన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఈ చిత్రానికి ఆదరణ తగ్గదని,అయితే పిల్లలు మాత్రం ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు కశ్యప్ కోరారు.

అలాగే ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' చిత్రాన్ని ఏదో ఉద్ధరించాలని తీయలేదంటున్నాడు అనురాగ్ కశ్యప్. కేవలం సబ్జెక్టు నచ్చడంతోనే దానిని సినిమా తీయాలనే ఆలోచన చేశానన్నాడు. జార్ఖండ్‌లోని పలు సామాజిక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత, కథా రచయిత అన్నీ తానే కావడంతో ఏదో ఆశించి సినిమాను తీశాననే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారని, అయితే సమాజంలో మార్పును ఆశించి తాను తెరకెక్కించలేదన్నాడు. ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు కొందరి హావభావాలు, పద్ధతులు ఆసక్తిగా అనిపించడంతోనే వాటిని సినిమాగా మలచాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

అయితే సినిమా ఆ ప్రాంతంలో మార్పు తెస్తుందా? లేదా? అన్న విషయంపై కూడా తానేమీ చెప్పలేనన్నాడు. ‘సమాజానికి చేటు చేసే ఘటనలు ఒకవేళ ఆ ప్రాంతంలో జరుగుతుంటే అవి ఇప్పటికే వార్తల రూపంలో పలుమార్లు ప్రసారమయ్యే ఉంటాయి. అయినా రాని మార్పు నేను సినిమా తీస్తే వస్తుందా? అయితే ఎలక్షన్స్ సమీపిస్తున్న సమయంలో నా సినిమా రావడంతో కొంత హైప్ క్రియేట్ అయ్యింతే' అని కశ్యప్ చెప్పాడు.

కామెంట్‌లు లేవు: