22 జూన్, 2012

అల్లు శిరీష్ చిత్రంలోకి గౌరవంగా...





















అల్లు అర్జున్‌ సోదరుడు అల్లు శిరీష్‌ హీరోగా త్వరలో 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కింగ్, పరుగు, మున్నా చిత్రాలకు డైలాగులు రాసిన మాటల రచయిత బివిఎస్ రవి తాజాగా అల్లు శిరీష్ చిత్రానికి ఎంపికయ్యాడు. ఈ విషయమై అల్లు శిరీష్ ట్విట్టర్లో స్పందిస్తూ...‘గౌరవం చిత్రం తెలుగు వెర్షన్‌కి మాటలు రాయడానికి వస్తున్నందుకు కృతజ్ఞతలు, అతని పనితనం తమ సినిమాను మరింత ఎలివేట్ చేస్తాయని ఆవిస్తున్నాం' అని ట్వీట్ చేశాడు.

ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్‌ హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్‌ రాజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

కాగా...'గౌరవం' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు శిరీష్ తన ప్రధాన వ్యాపారమయిన సౌత్ స్కోప్ మ్యాగజైన్ ని చెన్నైకి చెందిన ఒక కంపెనీకి అమ్మేశాడు. ఈ మ్యాగజైన్ ని లాంచ్ చేసినప్పుడు అందరూ ఇది మార్కెట్లో నెంబర్ వన్ గా నిలుస్తుందని అనుకున్నారు. కానీ ఈ పత్రిక నష్టాలు రెండు కోట్ల వరకూ చేరుకోవడంతో పాటు అల్లు శిరీష్ సినిమా ఆసక్తి కూడా దీన్ని అమ్మెయ్యడానికి కారణమయిందని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: