22 జూన్, 2012

బాలీవుడ్ నటి లైలా ఖాన్ అదృశ్యం: ఒకరి అరెస్టు





















బాలీవుడ్ నటి లైలా ఖాన్ అదృశ్యం కేసులో జమ్మూ పోలీసులు స్థానిక కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఏడాది క్రితం కిష్త్రర్ నుంచి మాయమయ్యారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో జమ్మూ పోలీసులు పర్వేజ్ అహ్మద్ తక్ అనే కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తున్నారు.

లైలాఖాన్‌కు చెందిన ఎస్‌యువిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇంతకు ముందు స్వాధీనం చేసుకున్నారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు 2011 మే 29 తేదీ నుంచి కనిపించకుండా పోయారు. వారు వాడిన మిత్సుబిషి అవుట్‌ల్యాండర్‌ను పర్వేజ్ అహ్మద్ తక్ అద్దెకు తీసుకున్నాడు. తక్ 2008 శానససభ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాతి నుంచి అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాహనం పాకిస్తానీ నటి అయిన లైలా ఖాన్ తల్లి సలీనా పటేల్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. ఆమె వఫా సినిమాలో రాజేష్ ఖన్నా సరసన 2008లో నటించింది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం లైలా ఖాన్ కోసం, ఆమె కుటుంబ సభ్యుల కోసం గాలింపు జరుపుతున్నారు.

లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యుల అదృశ్యంపై లైలా ఖాన్ తండ్రి నదీర్ షా పటేల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైలాఖన్, ఆమె తల్లి సలీనా పటేల్, ఆమె సోదరి అజ్మీనా పటేల్, ఆణె సవతి తండ్రి అసిఫ్ షేక్, వారి కుటుంబ మిత్రుడు పర్వేజ్ ఇక్బాల్ తక్ కనిపించకుండా పోయారని ఆయన ఫిర్యాదున చేశారు.

కామెంట్‌లు లేవు: