‘విశ్వరూపం'చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ తన తదుపరి చిత్రం
ప్రకటించారు. అది మరేదో కాదు...‘విశ్వరూపం' సీక్వెల్. ఈ విషయాన్ని ఆయన
మీడియాకు తెలియచేస్తూ...‘విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్
చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాం. స్క్రిప్ట్
కూడా రెడీ అయ్యింది అని తెలియచేసారు.
సీక్వెల్ తీయాలనుకోవటానికి
కారణం వివరిస్తూ...‘విశ్వరూపం'సీక్వెల్‌కి స్కోప్ ఉంది. మూడున్నరగంటల పాటు ఈ
కథను చూపించే బదులు కొంచెం మొదటి భాగం, మిగతాది రెండో భాగంలో
చూపించాలనుకుంటున్నాను అని చెప్పారు. అలాగే ఆ మధ్య మీడియాలో ఒక వార్త
వచ్చింది. ‘విశ్వరూపం' చిత్రాన్ని అవసరానికి మించి తీశానని, అందుకే
సీక్వెల్ విడుదల చేయాలనుకుంటున్నానని రాశారు. అది నాకు చాలా అవమానం
అనిపించింది అన్నారు.
కమల్ తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రం జూలై 13న విడుదల కానుంది. పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ
చిత్రంలో జరీనా వాహెబ్, శేఖర్‌కపూర్, రాహుల్ బోస్, ఆండ్రియ, జైదీప్
అహ్లావత్ నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్
పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు
పెట్టాడని సమాచారం. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని
చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్
పెట్టాడని తెలుస్తోంది.
చిత్రం కథ ప్రకారం ఒక మధ్యతరగతి యువతి తన
ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే
నిరంతర కృషితో అమెరికాలో చదువుతుంది. నిరు అనే నిరుపమకు ఎస్ అనే
విశ్వనాథన్‌కు మధ్య మూడేళ్ల ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ప్రేమ, పెళ్లితో
జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిరుపమ పనిలో పనిగా పీహెచ్‌డీ పూర్తి చేసి
డాక్టర్ నిరుపమా విశ్వనాథన్ హోదాను పొందుతుంది.
విశ్వనాథన్ తన కథక్
నాట్యశాల విద్యార్థులకు నృత్యం నే ర్పుతూ భార్యతో జీవితంలో స్థిరపడుతాడు.
డాక్టర్ నిరుపమ విశ్వనాథన్ తన స్థాయికి తగ్గ భర్త కాదని ఆయన్ని దూరం
చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. ఆయనలోని లోపాలను వెదకడానికి ఒక
డిటెక్టివ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత ఏమయ్యేందనేది విశ్వరూపం
చిత్రం అంటున్నారు. వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి
బాలీవుడ్ త్రయం శంకర్ మహదేవన్, ఎషాన్‌నూరణి, లాయ్ మెంటోసా (శంకర్ ఎషాన్
లాయ్) సంగీతం అందించారు. ఇందులో కమలహాసన్ ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారని
ప్రచారం జరుగుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి