ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా
(ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ మార్కెట్లో
హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండటాన్ని మనం చూస్తునే ఉన్నాం. ఈ మోడల్
ఉత్పత్తికి మించి డిమాండ్ ఉంటోంది. మరి ఇది మార్కెట్లో ఇంతటి సక్సెస్‌ను
సాధించడానికి కారణం ఏంటి..? ఇందులో అంత గొప్ప ఫీచర్లు ఏమున్నాయ్..? ఇది
ధరకు తగిన విలువ కలిగి ఉంటుందా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ
కథనం. ఈ గ్లోబల్ ఎస్‌యూవీ గురించిన పూర్తి సమాచారాన్ని డ్రైవ్ స్పార్క్
(DriveSpark) ఈ కథనంలో తెలియజేస్తుంది.
ఎమ్ అండ్ ఎమ్‌కు చెన్నైలో ఉన్న ప్రపంచ స్థాయి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ 'మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ'లో కంపెనీ తమ తొలి గ్లోబల్ ఎస్‌యూవీకి రూపకల్పన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల నుండి సంగ్రహించిన ఫీడ్‌బ్యాక్‌లను, ఇన్‌పుట్‌లను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ మోడల్‌ను డిజైన్ చేసింది. నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, పరీక్షా నిబంధనలు, నియంత్రణలు, కాలుష్య నిబంధనల విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించేలా కంపెనీ ఎక్స్‌యూవీ500ను అభివృద్ధి చేసింది. స్టయిల్, పెర్ఫామెన్స్, టెక్నాలజీ, సెఫ్టీ, కంఫర్ట్ విషయాల్లో ఇది కస్టమర్లకు నిజమైన పూర్తి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఉండే విశిష్టతలు ఏంటి..?
1. చిరుత పులి నుండి స్ఫూర్తి పొందిన డిజైన్ స్టయిల్:

మహీంద్రా
ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని చిరుత పులి నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు.
చిరుత మోహం నుంచి స్ఫూర్తి పొంది ఎక్స్‌యూవీ500 ఫ్రంట్ డిజైన్‌ను, చిరుత
శరీరం నుంచి స్ఫూర్తి పొంది ఎక్స్‌యూవీ500 బాడీ లైన్స్‌ను, చిరుత పంజా
నుంచి స్ఫూర్తి పొంది డోర్ హ్యాండిల్స్‌ను డిజైన్ చేయటం జరిగింది.
2. మోనోకాక్ నిర్మాణం (బాడీ అండ్ ఛాస్సిస్):
2. మోనోకాక్ నిర్మాణం (బాడీ అండ్ ఛాస్సిస్):
మహీంద్రా
ఎక్స్‌యూవీ500 బాడీ మొత్తాన్ని సింగిల్ (మోనోకాక్) షాషీ (ఛాస్సిస్)పై
నిర్మించారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడినది. ఇందులో
వాహన బాడీ, ఫ్లాట్‌ఫామ్ రెండూ కూడా సింగిల్ యూనిట్‌పై అమర్చబడి ఉండి మంచి
హ్యాండ్లింగ్ అండ్ డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది. (సాధారణ కార్లలో కారు
ఫ్లాట్‌ఫామ్‌ను వేరుగా, బాడీని వేరుగా అమర్చం జరుగుతుంది).
3. తిరుగులేని పెర్ఫామెన్స్:
మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అమర్చిన 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఇంతటి అధిక పవర్‌ను కలిగి ఉన్నప్పటికీ, మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా, ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.
4. హిల్ డిసెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్:
మహీంద్రా ఎక్స్‌యూవీ500 హిల్ డిసెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ ఫీచర్ల ద్వారా కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు దిగుడు రోడ్లు (స్లోప్ రోడ్స్) వచ్చినప్పుడు హిల్ డిసెంట్ ఫీచర్ దానిని గుర్తించి, ఆటోమేటిక్‌గా ఆన్ అయి హెచ్చరికతో పాటు వాహనానికి సహకరిస్తుంది. అలాగే, హిల్ హోల్డ్ ఫీచర్ సాయంతో ఎగుడు రోడ్లపై వాహనాన్ని నిలపాల్సి వచ్చినప్పుడు, మళ్లీ అక్కడి ముందు కదలడానికి ప్రయత్నించప్పుడు వాహనం వెనక్కు రాకుండా ఉన్న చోటి నుండే ముందుకు వెళ్లటానికి సహకరిస్తుంది.

5. డ్యూయెల్ మాస్ ఫ్లైవీల్ (డిఎమ్ఎఫ్):
డిఎమ్ఎఫ్ ఇంజన్ శబ్ధాన్ని, వైబ్రేషన్‌ను, హార్ష్‌నెస్‌ను తగ్గించడంలో సహకరించి, సౌకర్యవంతమైన మరియు సున్నితమైన గేర్ షిఫ్ట్ అనుభూతిని కల్పిస్తుంది. సాధారణ ఎస్‌యూవీల్లో ఇది అంత సులువుగా సాధ్యం కాదు. అందుకే ఎక్స్‌యూవీ500 మార్కెట్లోని ఈ సెగ్మెంట్లో అత్యంత ఉత్తమమైన ఉత్పత్తిగా నిలిచింది.
6. సిక్స్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు):
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇది పూర్తిగా ఇండియాలో అభివృద్ధి చేయబడి, పరీక్షించబడిన మొదటి 6-స్పీడ్ ట్రాన్సిమిషన్. దీని వలన ఇంజన్ టార్క్, స్పీడ్ పెరగడటమే కాకుండా, మంచి యాక్సిలరేషన్‌ను, మైలేజ్‌ను కూడా పొందవచ్చు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి