20 జూన్, 2012

ఆమె అందాలు వాళ్ల సొంతం...ఇక చెన్నయ్‌లోనే మకాం!





















హీరోయిన్ హన్సిక కుష్భూ మాదిరి చెన్నయ్ లోనే సెటిల్ అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తను చైన్నై కేంద్రంగానే అన్ని భాషల చిత్రాల షూటింగ్‌లకు హాజరవుతానని ప్రకటించింది. తమిళంలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది హన్సిక. ఈ సుందరి నటిస్తోన్న అరడజను తమిళ చిత్రాలు ప్రస్తుతం నిర్మాణంలో వుండటం విశేషం.

బాగా కండపట్టి పిటపిటలాడే హీరోయిన్లంటే తెగ అభిమానం ప్రదర్శించే తమిళ తంబీలు ఈ భామను అనతి కాలంలోనే అందలం ఎక్కించారు. దీంతో హన్సికకు తమిళంలో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. అంతేకాదు ఈ అమ్మడి అభిమానులందరూ కలసి తమిళనాడులోని ఓ జిల్లాలో ఆమెకు ఓ కోవెల కట్టించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. దాంతో తమిళ ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతగా తను చైన్నైలో సెటిలయిపోదామని నిర్ణయించుకున్నానని హన్సిక చెబుతోంది.

తెలుగులో హన్సిక నటించిన ఒకటిరెండు చిత్రాలు మినహా మిగిలిన చిత్రాలు విజయం సాధించకపోయినా.. ఆమెకు డిమాండ్‌ తగ్గకపోగా.. ఆమె సొగసుల పరిమళాలు తమిళనాడుకు కూడా వ్యాపించి.. ఆ భాషలోనూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతుండడం విశేషం!

తాజాగా ఆమె తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఎంపికైంది. సింగమ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రంలో ఈమెను ఎంపిక చేసారు. హన్సిక ఈ సినిమాలో కాలేజ్ గర్ల్‌గా కనిపించన్నుది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం ఒకేసారి విడుదల చేయటనికి సన్నాహాలు చేస్తున్నారు. హన్సిక..నాగచైతన్య సరసన త్వరలో నటించబోతోందని సమాచారం. నాగచైతన్య, సునీల్‌ కలిసి చేయబోతున్న వెట్టై రీమేక్ చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెను ఎంపిక చేసారు. ప్రస్తుతం హన్సిక తెలుగులో మంచు విష్ణు సరసన ‘దేనికైనా రెడీ' చిత్రంలో నటిస్తోంది.

కామెంట్‌లు లేవు: