18 జూన్, 2012

టీవీలో వస్తుంటే మళ్లీ చూశా:మహేష్ బాబు




















'దూకుడు నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రం. ఈమధ్య టీవీలో వస్తుంటే మళ్లీ చూశా. అప్పుడు కూడా ప్రతి సన్నివేశం ఆస్వాదించాను''అన్నారు మహేష్‌బాబు. ఆయన నటించిన 'దూకుడు' చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా 'మా సినిమా అవార్డు' అందుకొన్నారు. ఈ సందర్భంగా మహేష్ ఇలా స్పందించారు.

అలాగే ''ఇద్దరు అగ్రనటుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చింది. 'దూకుడు' కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డారు. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది''అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మా సినిమా అవార్డ్స్‌ 2012 కార్యక్రమం జరిగింది. చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా మహేష్‌బాబు అవార్డు స్వీకరించారు.

నయనతార మాట్లాడుతూ ''సీత పాత్రకు నేను సరిపోతాను అని భావించి, నన్ను ప్రోత్సహించిన బాపు, బాలకృష్ణలకు ఈ పురస్కారం అంకితం'' అన్నారు. ఉత్తమ నటి గా నయనతార కు శ్రీరామరాజ్యం చిత్రంకి గానూ ఈ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సహనటుడిగా ప్రకాష్‌రాజ్‌ (దూకుడు), ఉత్తమ దర్శకుడిగా శ్రీనువైట్ల (దూకుడు) అవార్డులు అందుకొన్నారు.
జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకి దక్కింది. కమల్‌హాసన్‌, చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం అందుకొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు సంయుక్తంగా రాఘవేంద్రరావుకి జ్ఞాపిక అందజేశారు. ప్రత్యేక జ్యూరీ అవార్డును ‘రాజన్న'కు నాగార్జున, ‘దూకుడు'కి ఉత్తమ దర్శకుడిగా శ్రీను వైట్ల, ఉత్తమ చిత్రం విభాగంలో ‘దూకుడు' నిర్మాతలు రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపి ఆచంట, సహాయ నటుడిగా ‘దూకుడు'కి ప్రకాష్‌రాజ్ ఇచ్చారు.

‘అనగనగా ఓ ధీరుడు'కి సహాయ నటిగా లక్ష్మీప్రసన్న, నూతన నటుడిగా ‘ప్రేమ కావాలి'కి ఆది, నూతన నటిగా ‘అనగనగా ఓ ధీరుడు'కి శ్రుతిహాసన్, విలన్‌గా ‘దూకుడు'కి సోనూసూద్, బెస్ట్ ప్రామిసింగ్ ఫేస్ అవార్డును ‘ప్రేమ కావాలి'కి ఇషా చావ్లా, ప్రత్యేక అభినందన పురస్కారం ‘దూకుడు'కి ఎమ్మెస్ నారాయణ అందుకున్నారు. ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు. పలువురు చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ అవార్డు వేడుకలో దేవిశ్రీప్రసాద్ ఆటాపాటా, శ్రీయ, తమన్నా, అంజలి లావనియా నృత్యప్రదర్శనలు ప్రధాన ఆకర్షణ అయ్యాయి.

కామెంట్‌లు లేవు: