జులైలో శ్రీలంకలో టీమిండియా ఐదు అంతర్జాతీయ వన్డేలు, ఒక టి20 ను
ఆడేందుకు బిసిసిఐ ప్రణాళికను సిద్దం చేసింది. బిసిసిఐ విడుదల చేసిన
అధికారిక సమాచారం ప్రకారం శ్రీలంక క్రికెట్ బోర్డు ఇండియాతో వచ్చే నెలలో ఓ
సిరిస్ ఆడేందుకు సిద్దమైంది. ప్రస్తుతం బిజీ టీమిండియా బిజీ షెడ్యూల్‌లో
ఉన్నప్పటికీ.. ఒక వన్డే సిరిస్‌తో పాటు టి20ను ఆడించేందుకు బిసిసిఐ
అంగీకరించింది.
సెప్టెంబర్‌లో శ్రీలంకలో ఐసిసి వరల్డ్ ట్వంటీ20
జరగనున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని ఈ మ్యాచ్ లను
నిర్వహిస్తున్నట్లు బిసిసిఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం
శ్రీలంక, పాకిస్దాన్ వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఐసిసి వరల్డ్
ట్వంటీ20కు ముందు ఆస్టేలియా, పాకిస్దాన్ కూడా మూడు టి20లను ఆడేందుకు
సిద్దమయ్యాయి.
ఫిబ్రవరిలో ఆసియా కప్‌లో వందో సెంచరీని సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ మెగా టోర్నీలో పాల్గోనున్న విషయాన్ని బిసిసిఐ
ధృవీకరించలేదు. జులై మూడవ వారంలో ఈ వన్డే సిరిస్‌ను షెడ్యూల్ చేయనున్నారు.
ఈ వన్డే సిరిస్ అనంతరం ఐసిసి వరల్డ్ ట్వంటీ20 ముందు ఇండియా ఆగస్టులో
న్యూజిల్యాండ్‌తో రెండు టెస్టులు ఆడుతుంది.
India's tour of Sri Lanka 2012
1st ODI: Sri Lanka v India, Hambantota - Jul 22, 2012
2nd ODI: Sri Lanka v India, Hambantota - Jul 24, 2012
3rd ODI: Sri Lanka v India, Colombo (RPS) - Jul 28, 2012
4th ODI: Sri Lanka v India, Colombo (RPS) - Jul 31, 2012
5th ODI: Sri Lanka v India, Pallekele - Aug 4, 2012
Only T20I: Sri Lanka v India, Pallekele - Aug 7, 2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి