హాలీవుడ్ స్టార్ హీరో అలెక్ బాల్డ్విన్ తనతో
పెండ్లినిశ్చయమైన అమ్మాయి హిలారియా థామస్ ఇద్దరూ ఒక ఇంటివారయ్యారు. 54
సంవత్సరాల వయసు కలిగిన అలెక్ బాల్డ్విన్ 28 సంవత్సరాల వయసు కలిగిన హిలారియా
థామస్ శనివారం సెయింట్ పాట్రిక్స్ ఓల్డ్ కతేఢ్రల్ లో వివాహం చేసుకున్నారు.
హిలారియా థామస్ యోగా గురువుగా సుప్రసిద్దం.
వీరిద్దరి పెళ్లికి
హాజరైన ఓ అతిధి చెప్పిన దాని ప్రకారం న్యూయార్క్‌లో ఉన్న సెయింట్
పాట్రిక్స్ ఓల్డ్ కతేఢ్రల్‌లో సాయంత్రం వీరి వివాహానికి అతిరథ మహారధులు
హాజరవ్వగా... హిలారియా థామస్ చేతికి అలెక్ బాల్డ్విన్ రింగుని తొడిగారు. ఈ
వివాహానికి హాలీవుడ్ ప్రముఖలతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన స్నేహితులు
హాజరయ్యారు.
వీరిద్దరి వివాహం క్యాథలిక్ సెరమనీ రెవ. ఫాదర్ జార్జి
డీస్ పర్యవేక్షణలో జరిగింది. అలెక్ బాల్డ్విన్ బ్రదర్స్ స్టీఫెన్, బిల్లీ
లతో పాటు అలెక్ బాల్డ్విన్ కూతురు ఐర్లాండ్, డైరెక్టర్ వూడీ అలెన్,
హీరోయిన్ మరీక్షా హార్గిట్వే తదితరులు హాజరయ్యారు. అమెరికన్ హీరో అయిన
అలెక్ బాల్డ్విన్ తన జీవితంలో ఫిల్మ్, స్టేజి, టెలివిజన్ మూడింటిలోనూ
నటించారు.
సోప్ ఓపెరా 'నాట్స్ లాండింగ్' అనే టెలివిజన్ సీజన్లలలో
నటించిన జాషువా రష్ అనే పాత్ర ద్వారా తోలిసారి గుర్తింపుని పొందారు. ఆ
తర్వాత ది షాడో, ది ఎవియేటర్, ది డిపార్టెడ్ లాంటి బాక్సాఫీసు చిత్రాల్లో
నటించారు. 2003వ సంవత్సరంలో అలెక్ బాల్డ్విన్ నటించిన ది కూలర్ అనే
సినిమాలో నటనకు గాను బెస్ట సపోర్టింగ్ యాక్టర్ అకాడమీ అవార్డుకు నామినేట్
అయ్యారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి