డిసిప్లేన్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను, ఏమైనా తేడాలు వస్తే
తాట తీస్తాను.... ఈ విషయంలో నేను చాలా చెడ్డదాన్ని అంటోంది మహేష్ బాబు
సతీమణి నమ్రత శిరోద్కర్. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ
విధంగా మాట్లాడుతూ నవ్వులు చిందించింది ఈ మాజీ మిస్ ఇండియా. అదే సమయంలో
పరిస్థితిని బ్యాలన్స్ చేస్తూ మా పిల్లలతో స్నేహంగా ఉండటానికి
ప్రయత్నిస్తాం, కొన్ని ఇళ్లలో పేరెంట్స్ పిల్లల పాలిట పోలీస్ ఆఫీసర్లుగా
వ్యవహరిస్తుంటారు అని చెప్పుకొచ్చింది.
అదే విధంగా తమకు రెండో సంతానం
కలిగినట్లు వచ్చిన వార్తలను కూడా కొట్టి పారేసింది నమ్రత. జులై నెల
తర్వాతనే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఏ విషయంలో
అయినా మహేష్‌కు, తనకు మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉంటుందని, ఏ నిర్ణయం
తీసుకోవాలన్నా ఇద్దరం చర్చించి తీసుకుంటామని చెప్పుకొచ్చింది.
భవిష్యత్‌లో
సినిమాల్లో నటించే విషయమై ఎలాంటి ప్లాన్ లేదని, దాని గురించి
ఆలోచించడానికి తనకు అసలు సమయం కూడా లేదని నమ్రత వెల్లడించింది. ప్రస్తుతం
మహేష్ బాబు చేతి నిండా పనితో బిజీగా గడుపుతున్నారు. దీంతో అతని వ్యవహారాలు
చాలా వరకు నేనే డీల్ చేయాల్సి వస్తోంది...సో నేను కూడా బీజీగానే ఉన్నాను
అంటోంది.
కాగా...త్వరలో ఈ జంట బాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ ను
స్థాపించే యోచనలో ఉన్నారని, ఇందు కోసం ముంబైలో తమకు తెలిసిన వారి ద్వారా
ప్రయత్నాలు మొదలు పెట్టారని ఫిల్మ్ నగర్ గుసగుస. బహుషా దీని ద్వారానే మహేష్
బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి